మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన
వనపర్తి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనుజ్ఞా రెడ్డి
పెద్దమందడి,డిసెంబర్28(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చీకరు చెట్టు తాండలో వనపర్తి బిజెపి కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి అనుజ్ఞా రెడ్డి, తాండ సర్పంచ్ లలిత కిషన్ నాయక్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు.ఈ సందర్భంగా అనుజ్ఞా రెడ్డి మాట్లాడుతూ..మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలతో నేరుగా మమేకమై వారి విజయాలు, సేవా కార్యక్రమాలు, ప్రేరణాత్మక అంశాలను పంచుకుంటున్నారని అన్నారు. సమాజంలో మార్పు తీసుకొచ్చే సాధారణ ప్రజల కథలను దేశవ్యాప్తంగా పరిచయం చేయడం ద్వారా ప్రజల్లో దేశభక్తి, సామాజిక బాధ్యతను మరింత పెంపొందిస్తున్నారని పేర్కొన్నారు.అలాగే యువత, మహిళలు, రైతులు, గిరిజనులు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న సందేశాన్ని ఈ కార్యక్రమం స్పష్టంగా ఇస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా ప్రజలు చైతన్యవంతులుగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక గ్రామస్తులు పాల్గొని మన్ కీ బాత్ ప్రసంగాన్ని ఆసక్తిగా వీక్షించారు.


Comments