మృతిచెందిన నాగమ్మ కుటుంబానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆర్థిక సాయం
పెద్దమందడి,డిసెంబర్29(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన కొమ్ము కల్లుబండి నాగమ్మ (65) ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై మృతి చెందగా, ఈ విషాద ఘటనపై రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. మృతురాలి కుటుంబానికి ఆయన ఆర్థిక సాయం అందజేశారు.మాజీ మంత్రి ఆదేశాల మేరకు సోమవారం పెద్దమందడి మండల బీఆర్ఎస్ నాయకుల ద్వారా రూ.5,000 నగదు సాయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు సేనాపతి, జంగం రమేష్, పురుషోత్తం రెడ్డి, బుజ్జిబాబు, సింగిరెడ్డి కురుమూర్తి, సుర శ్రీనివాసులు, కొమ్ము కుతల నరసింహ, కొమ్ము బ్రహ్మం, కొమ్ము విష్ణు, కొమ్ము శివకృష్ణ, సింగిరెడ్డి వెంకటస్వామి, గొల్ల మోగిలయ్య, కొమ్ము నరసింహులు, తాడిపర్తి వెంకటయ్య, కొమ్ము కురుమయ్య, గుడిసె మల్లేష్, కొమ్ము నాగరాజు తదితరులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Comments