పొలంలో గుర్తుతెలియని శవం.
హసన్ పర్తి,జనవరి 07(తెలంగాణ ముచ్చట్లు):
హసన్ పర్తి మండలం అనంతసాగర్ గ్రామ శివారులో బుధవారం రోజున గుర్తుతెలియని శవం లభ్యమైనట్లు హసన్ పర్తి ఇన్స్పెక్టర్ వట్టె చేరాలు తెలిపారు. వివరాల్లోకి వెళితే అనంతసాగర్ గ్రామ శివారులోని వట్టే వెంకటరమణారెడ్డి కౌలుకు చేస్తున్న పొలంలో మగ వ్యక్తి చనిపోయి ఉన్నట్లు గుర్తించామని ఇన్స్పెక్టర్ తెలియజేశారు.ఆ వ్యక్తి నలుపు రంగు కోల మొహం కలిగి 40-45 సంవత్సరాలు ఉండవచ్చునని ఎడమ వైపు ఛాతిపై పుట్టుమచ్చ,నలుపు తెలుపు రంగు జుట్టు, ఎరుపు నలుపు తెలుపు రంగుల గల్లల అంగి, కుడి చేతికి చిన్న పూసల దండ, ఎడమ చేయికి నలుపు దారం కలిగి ఉన్నాడని, ప్రాథమిక దర్యాప్తులో అనంతసాగర్ గ్రామస్తులు చెప్పిన వివరాలను బట్టి మతిస్థిమితం సరిగా లేకుండా ముందురోజు గ్రామంలో తిరుగుతుండగా కొంతమంది గమనించినట్లు తెలిపారని కావున అట్టి వ్యక్తి గురించి ఏవైనా అనవాళ్లు తెలిసినట్లయితే హసన్ పోలీస్ స్టేషన్-8712685051, ఎస్సై 8712685097, ఇన్స్పెక్టర్ 8712685124 నెంబర్లకు హసన్ పర్తి పోలీసులు కోరారు.


Comments