ముగ్గులు భారతీయ సంస్కృతి ప్రతీకలు

డా. జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు 

ముగ్గులు భారతీయ సంస్కృతి ప్రతీకలు

వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు):

భారతీయ సంస్కృతిలో ముగ్గుల సంప్రదాయం అత్యంత పురాతనమైనదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి పట్టణ కేంద్రంలోని వెంగళరావు కాలనీలో ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ జిల్లా ఇన్‌చార్జ్ భాస్కర్, కోట్ల శిరీష రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల ప్రధాన ఉత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డా. చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ముగ్గులు కేవలం ఇంటి అలంకరణకే పరిమితం కాదని, వాటి వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్య, సామాజిక కారణాలు దాగి ఉన్నాయని తెలిపారు. ముగ్గులు దుష్టశక్తులను నివారించి, లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయని, పశుపక్ష్యాదులకు ఆహారాన్ని అందించే సంప్రదాయ భావనతో పాటు మెదడు చురుకుదనాన్ని పెంపొందిస్తాయని అన్నారు.పట్టణీకరణ పెరుగుతున్నా వనపర్తిలో మహిళలు సంప్రదాయాలను గౌరవిస్తూ ముగ్గులు వేయడం అభినందనీయమని పేర్కొన్నారు.ముగ్గుల పోటీల్లో మొత్తం 84 మంది పాల్గొనగా, మానసకు మొదటి బహుమతి, శివమ్మకు రెండో బహుమతి, శ్రీలక్ష్మికి మూడో బహుమతి లభించాయి.విజేతలకు నగదు బహుమతులు, షీల్డ్‌లతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్ధన్, రాష్ట్ర మహిళా నాయకురాలు ధనలక్ష్మి, వనపర్తి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు యాదవ్, వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం వినోద్, పలుస శంకర్ గౌడ్, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, సీనియర్ నాయకులు జానంపేట నాగరాజు, కోళ్ల వెంకటేష్, ఎంట్ల రవి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.IMG-20260104-WA0119

Tags:

Post Your Comments

Comments

Latest News

మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో నూతన వార్డు సభ్యులకు ఘన సన్మానం మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో నూతన వార్డు సభ్యులకు ఘన సన్మానం
అడ్డాకల్,జనవరి5(తెలంగాణ ముచ్చట్లు): మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో సోమవారం మహబూబ్నగర్ జిల్లా  అడ్డకల్ మండల కేంద్రంలో మహిళా సమైక్య కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల...
బీసీ భవన నిర్మాణానికి అనుమతి.!
గురుకులాల బలోపేతానికి రూ.10.65 కోట్లు మంజూరు
అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన మణిగిల్ల సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్
ఓణీల–పంచకట్టు వేడుకల్లో చిన్నారులను ఆశీర్వదించిన సోయం వీరభద్రం.
కేటీఆర్ ఖమ్మం పర్యటనను విజయవంతం చేయాలి.
భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం