మనిగిల్ల ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
పాఠశాల అభివృద్ధికి పలు హామీలు- -
సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్
పెద్దమందడి,జనవరి3(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందరం మండలం మనిగిల్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైన నూతన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచ్ ముప్పూరి గణేష్‌లను ఉపాధ్యాయ బృందం శాలువాలతో ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేష్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే సేవలను వక్తలు ఘనంగా కొనియాడారు.ఈ సందర్భంగా సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…సావిత్రిబాయి పూలే గొప్ప సంఘ సంస్కర్త, కవయిత్రి, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు.1848 జనవరి 1న దేశంలో తొలి బాలికల పాఠశాలను స్థాపించి మహిళా విద్యకు నాంది పలికారు. ఆమె జన్మదినమైన జనవరి 3ను జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. అనేక అవమానాలు, అడ్డంకులు ఎదురైనా వందలాది పాఠశాలలు స్థాపించి మహిళలకు విద్యను అందించిన వీరనారి ఆమె అని అన్నారు. విద్యార్థులు సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని చదువులో రాణించాలని సూచించారు.ఉపసర్పంచ్ ముప్పూరి గణేష్ మాట్లాడుతూ… విద్యార్థులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. చదువులో ప్రతిభ చూపే విద్యార్థులకు ప్రోత్సాహకంగా తొలి స్థానంలో నిలిచిన వారికి రూ.10 వేల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా పాఠశాల సమస్యలను ఉపాధ్యాయులు సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లగా, వాటిని పరిష్కరిస్తానని సర్పంచ్ హామీ ఇచ్చారు.మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ఉచిత ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆటపోటీలు నిర్వహించేందుకు తన సొంత ఖర్చుతో ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. జనవరి 26లోగా పాఠశాల స్టేజ్‌ను విస్తరిస్తామని, అన్యువల్ డే వేడుకల కోసం త్వరలో డాన్స్ మాస్టర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే 1 నుంచి 5 తరగతుల విద్యార్థులు రేకుల కింద చదువుకోవాల్సిన ఇబ్బందులను తొలగించేందుకు పీఓపీ షెడ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచ్ ముప్పూరి గణేష్, గ్రామ పెద్దలు ఎస్. రాములు, పోతుల రామిరెడ్డి, దానియేలు, హైస్కూల్ హెచ్‌ఎం వెంకటేశ్వర్లు, జానయ్య, సుధాకర్ ఆచారి, ఎండి రఫీ, నజ్రిన్ బేగం, ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం వి.రాములు, లావణ్య, రేణుక, జీకే శ్రీనివాసులు, గ్రామస్తులు కొములయ్య, వెంకటయ్య, తిరుపతయ్య, రామకృష్ణ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఎర్ర తిరుపతయ్య, హరిజన రాములు, హరిజన లక్ష్మయ్య, బోయిన కృష్ణ, బందన్న, బీకే బోడి గణేష్,
ముప్పూరి సాయి, ముప్పూరి పవన్, మల్లికార్జున్, అశోక్, హరిజన రాజు, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments