ఉప్పల్ జోనల్ కమిషనర్‌ని కలిసిన కాంగ్రెస్ కార్పొరేటర్లు
_నియోజకవర్గ సమస్యలను జడ్సీ దృష్టికి తీసుకెళ్లిన ప్రజాప్రతినిధులు
ఉప్పల్, డిసెంబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు ):
జీహెచ్ఎంసీ ఉప్పల్ జోనల్ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రాధిక గుప్తాను ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ కార్పొరేటర్లు మర్యాదపూర్వకంగా కలిశారు.బుధవారం ఉప్పల్ జోనల్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఉప్పల్, చర్లపల్లి, కాప్రా డివిజన్లకు చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి, బొంతు శ్రీదేవి, స్వర్ణరాజు జోనల్ కమిషనర్ రాధిక గుప్తాకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రధాన సమస్యలను, అలాగే చేపట్టాల్సిన అభివృద్ధి పనుల వివరాలను కార్పొరేటర్లు జడ్సీ దృష్టికి తీసుకువచ్చారు. మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలపై చర్చించారు.నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన అన్ని పనులను సమన్వయంతో చేపట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జడ్సీ రాధిక గుప్తా హామీ ఇచ్చారు.


Comments