కుషాయిగూడ–నేరేడ్మెట్ పోలీసుల సంయుక్త వాహన తనిఖీలు

సైనిక్‌పురి ఎక్స్‌ రోడ్‌ వద్ద విస్తృత తనిఖీలు

కుషాయిగూడ–నేరేడ్మెట్ పోలీసుల సంయుక్త వాహన తనిఖీలు

కుషాయిగూడ, జనవరి 03 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో కుషాయిగూడ మరియు నేరేడ్మెట్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం సైనిక్‌పురి ఎక్స్‌ రోడ్‌ వద్ద విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 25 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.తనిఖీల సందర్భంగా వాహనదారుల లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, బీమా పత్రాలు తదితరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని 15 వాహనాలను గుర్తించి నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకున్నారు.ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని చట్టబద్ధమైన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు చేపడుతున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి వాహన తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .