పెద్ద చెరువుకట్టపై శుభ్రత పనులను పరిశీలిం చిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
సొంత ఖర్చులతో చెత్త, పిచ్చి మొక్కల తొలగింపు – వాకర్లకు ఉపశమనం
నాచారం, జనవరి 04 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ లో హెచ్ఎంటి నగర్ పరిధిలోని పెద్ద చెరువు, ఇంద్రానగర్ వైపు చెరువు కట్టపై పిచ్చి మొక్కలు, అనవసరమైన చెట్లు గుంపులు గుంపులుగా మొలవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో నిత్యం వాకింగ్‌కు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అదేవిధంగా చెరువు కట్టపై ఏర్పాటు చేసిన వీధి దీపాలు పనిచేయకపోవడంతో భద్రతాపరమైన సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని స్థానికులు నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన సంబంధిత అధికారులకు పలుమార్లు చెరువు కట్టపై పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్త కుప్పలు, మట్టి కుప్పలను తొలగించి వాకర్లకు అనుకూలంగా మార్గాన్ని సక్రమంగా నిర్వహించాలని సూచించారు.అయితే అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో సమస్య యథాతథంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ తన సొంత ఖర్చులతోనే ఆదివారం రోజు చెరువు కట్టపై పేరుకుపోయిన చెత్త, మట్టి కుప్పలు, పిచ్చి మొక్కలను తొలగించే శుభ్రత కార్యక్రమాన్ని స్వయంగా చేపట్టారు.ఈ చర్యతో వాకింగ్‌కు వచ్చే స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.త్వరలో నే చెరువు కట్టపై ఉన్న వీధి దీపాలను మరమ్మతులు చేసి తిరిగి వెలిగేలా చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు.
పాల్గొన్నవారుఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ చంద్రశేఖర్, అజీమ్, భాను ఆంటీ, జాకీర్, అలీమ్, షానవాజ్ జహీర్, ఫారూఖ్, అంజి యాదవ్, అంజద్, అహ్మద్, అలీమ్, ఫరూక్ తదితరులు పాల్గొన్నారు.


Comments