ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన ప్రభుత్వము అరెస్టు చేయడం అప్రజాస్వామికం.
ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు రేణుకుంట్ల దుర్గాప్రసాద్.
హాసన్ పర్తి,జనవరి 03(తెలంగాణ ముచ్చట్లు):
హసన్ పర్తి మండలంలోని వివిధ ఆటో కార్మిక సంఘాల నాయకుల అరెస్టును ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు రేణుకుంట్ల దుర్గాప్రసాద్ ఖండిచారు.ఈ సందర్బంగా ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని రెండేళ్లు అయినా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో సంఘాల నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్ జీవితాలు ఆగమైతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్ల జీవనోపాధి కష్టమైందని ఆటో డ్రైవర్లలకు ఇస్తామన్న 12 వేల నగదు సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిందని విమర్శించారు.ఆటో నడిపినా ఇల్లు గడవకపోవడంతో వందలాదిమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇచ్చిన హామీ అమలు మరిచి, వారి డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్న ఆటో డ్రైవర్లను అరెస్టు చేయడం అప్రజాస్వామికం జిల్లా వ్యాప్తంగా అరెస్ట్ చేసిన ఆటో డ్రైవర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అరెస్ట్ అయిన వారిలో తాళ్ల మధు,అరెల్లి స్వామి,మట్టెడ స్వామి,గాజుల రాజు ఉన్నారు.


Comments