పెద్దమందడి కస్తూర్బాలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
పెద్దమందడిజనవరి3(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండల కేంద్రంలోని కస్తూర్బా వసతి గృహంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలకు పెద్దమందడి నూతన సర్పంచ్ సూర్య గంగా మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, వార్డు సభ్యులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పెద్దమందడి సర్పంచ్ సూర్య గంగా రవి మాట్లాడుతూ…భారతదేశంలో మహిళా విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే.మహిళలు, బాలికలు విద్యావంతులైతేనే సమాజంలో సమానత్వం, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. కస్తూర్బా వసతి గృహాల్లో అందిస్తున్న విద్య గ్రామీణ ప్రాంత బాలికల జీవితాలను మార్చుతోంది.విద్యార్థినుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సేవలు అభినందనీయం అని అన్నారు.అనంతరం మాజీ జెడ్పీటీసీ వెంకటస్వామి మాట్లాడుతూ..సావిత్రిబాయి పూలే భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా మహిళా విద్యకు వెలుగు నింపారు.సామాజిక వివక్షను ఎదుర్కొంటూ విద్య ద్వారానే మార్పు సాధ్యమని నిరూపించారు. ఆమె ఆశయాలు నేటి తరానికి ఆదర్శం. బాలికలు చదువులో ముందుకు సాగేందుకు కస్తూర్బా పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయి అని తెలిపారు.సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కస్తూర్బా వసతి గృహంలో చదువుతున్న విద్యార్థినీలు నృత్యాలతో, డ్యాన్సులతో, అలరించే సాంస్కృతిక ప్రదర్శనలతో వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.విద్యార్థినీల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం నూతనంగా ఎన్నికైన పెద్దమందడి సర్పంచ్ సూర్య గంగా రవిని శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎన్నికైన ప్రజాప్రతినిధులు కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పెద్దమందడి సర్పంచ్ సూర్య గంగా రవి, మాజీ జెడ్పీటీసీ వెంకటస్వామి, వార్డు సభ్యులు కొమ్ము విష్ణు, కొమ్ము బ్రహ్మం ,సింగిరెడ్డి అమల కురుమూర్తికొమ్ము సత్యనారాయణ,నీలం రవి, కస్తూర్బా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినీలు పాల్గొన్నారు.


Comments