కరాటే ఆత్మరక్షణకు ఎంతో అవసరం
కార్పొరేటర్ ప్రభుదాస్
కాప్రా, డిసెంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ మీర్పేట్ హెచ్. బి కాలనీ డివిజన్ భవాని షోటోకన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్ కార్యక్రమానికి కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రభుదాస్ మాట్లాడుతూ, పిల్లలు చదువులతో పాటు కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్‌ను నేర్చుకోవడం ఆత్మరక్షణకు ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు మార్షల్ ఆర్ట్స్‌లో నైపుణ్యం సాధించాలని సూచించారు. కరాటే నేర్చుకోవడం ద్వారా శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా దృఢంగా తయారవుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ కత్తుల పృథ్వీ కుమార్, నాయకులు కత్తుల రాజ్ కుమార్, సింగపాక లింగం, కొయ్యడ జయపాల్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో కరాటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరై పోటీలను ఉత్సాహంగా వీక్షించారు.


Comments