పెండింగ్‌లో ఉన్న లెప్రసీ డబ్బులు విడుదల చేయాలి

పెద్దమందడిలో ఆశ కార్యకర్తల ధర్నా

పెండింగ్‌లో ఉన్న లెప్రసీ డబ్బులు విడుదల చేయాలి

పెద్దమందడి,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలంలోని ఆశ కార్యకర్తలకు సంబంధించిన 2025 కుష్టు డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆశ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.అనంతరం డాక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న కుష్టు డబ్బులను వెంటనే విడుదల చేయాలని, డిసెంబర్‌లో నిర్వహించే కుష్టు సర్వేకు అదనంగా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ఆశ కార్యకర్తలకు నెలకు రూ.18,000 ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని, పల్స్ పోలియో, గ్రామపంచాయతీ ఎన్నికల డ్యూటీలకు సంబంధించిన డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఫిక్స్‌డ్ వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించి, కేంద్రం పెంచిన పారితోషకాలను రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశ కార్యకర్తలకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ అమలు చేస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, ప్రతి ఆదివారం, పండుగలకు సెలవులు ప్రకటించాలని కోరారు. అలాగే డిసెంబర్ 10న ఇచ్చిన హామీ ప్రకారం ఏఎన్‌సీపీ, ఎన్‌సీ తదితర టార్గెట్లను రద్దు చేస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.ఆశ కార్యకర్తలకు రూ.5 లక్షల రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వాలని, ప్రస్తుతం ఇస్తున్న పారితోషికంలో సగాన్ని పెన్షన్‌గా నిర్ణయించి అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు డి. గిరిజ, ఉపాధ్యక్షురాలు బాల మన్నెమ్మ, కార్యదర్శి భారతి, సహాయ కార్యదర్శి కాజమ్మ, కోశాధికారి పోషమ్మ, ఎం. రాధా, నారాయణమ్మ, సి. రాధా, సరస్వతి, ఉమాదేవి, మమత, వి. రాధ, సుగుణమ్మ, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .