ధర్మసాగర్ మండలంలో గణిత టాలెంట్ టెస్ట్ నిర్వహణ
ఉత్తమ ప్రతిభ కనబర్చిన తాటికాయల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని జాహ్నవి
ధర్మసాగర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు):
గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజును పురస్కరించుకొని ధర్మసాగర్ మండలంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మండల స్థాయి గణిత టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. మండలంలోని వివిధ పాఠశాలల నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. గణితంపై ఆసక్తి పెంపొందించడం, ప్రతిభావంతులను గుర్తించడం లక్ష్యంగా ఈ పరీక్షను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి డాక్టర్ బి. రామ్ ధన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గణిత ఫోరం మండల అధ్యక్షుడు బండ రమేష్, జిల్లా కమిటీ సభ్యుడు పింగిలి సత్యనారాయణ రెడ్డి, వివిధ పాఠశాలల గణిత ఉపాధ్యాయులు, బాలుర ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు కవిత తదితరులు హాజరయ్యారు.
టాలెంట్ టెస్ట్ ఫలితాల్లో తాటికాయల ఉన్నత పాఠశాలకు చెందిన జాహ్నవి ప్రధమ స్థానం సాధించగా, ధర్మసాగర్ గర్ల్స్ హై స్కూల్‌కు చెందిన అక్షిత ద్వితీయ స్థానం, పెద్ద పెండ్యాల పాఠశాల విద్యార్థి అర్బన్ కుమార్ తృతీయ స్థానం పొందారు. రెసిడెన్షియల్ విభాగంలో కస్తూర్బా పాఠశాల విద్యార్థిని కృష్ణవేణి ప్రధమ స్థానం సాధించగా, టీవీఎస్‌డబ్ల్యూ ఆర్ ఎస్ విభాగంలో లక్ష్మీ ప్రసన్న వర్షిని మరియు జెస్సిలు విజేతలుగా నిలిచారు.ఈ పోటీ ద్వారా విద్యార్థుల్లో గణితంపై ఆసక్తి మరింత పెరుగుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.


Comments