రైతులను సన్మానించిన బ్యాంక్ అధికారులు.
Views: 6
On
హాసన్ పర్తి, డిసెంబర్ 23(తెలంగాణ ముచ్చట్లు):
రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని హసన్ పర్తి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోని రైతులను బ్యాంక్ మేనేజర్ సకులాల్ లకావత్ కార్తీక్ సన్మానించారు.ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ దేశానికి అన్నం పెడుతున్న రైతులకు అభివందనమని పేర్కొన్నారు. ప్రతి రైతు దేశానికి గర్వకారణమని,రైతులు ఉత్పత్తి దారులనుండి నుండి వ్యవస్థాపకులుగా మారాలని కోరారు.బ్యాంక్ అందిస్తున్న కిసాన్ సమృద్ధి పథకం,దీర్ఘ,స్వల్పకాలిక పంట రుణాలు గురించి రైతులకు వివరించారు.సకాలంలో రుణాలను చెల్లించినట్లయితే కలిగే ప్రయోజనాలను,రుణం తీసుకొని మరణించిన రైతుల రుణ విముక్తి విదానాలను వివరించారు.
బ్యాంకుల అందిస్తున్న వివిధ రుణ సదుపాయాలను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు పరిధిలోని ఎనిమిది గ్రామాల నుండి 50 మంది రైతులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
07 Jan 2026 20:54:45
_రాత్రి 10 తర్వాత శబ్ద కాలుష్యం, బాణాసంచాపై కఠిన చర్యలు: పోలీసులు
కుషాయిగూడ, జనవరి 07 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్...


Comments