ఫాధర్ కొలంబో(సిబిఎస్ఈ)

పాఠశాలలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు 

ఫాధర్ కొలంబో(సిబిఎస్ఈ)


IMG-20251223-WA0128IMG-20251223-WA0129

స్టేషన్ ఘనపూర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు):  మండల కేంద్రంలోని ఫాదర్ కొలంబో( సిబిఎస్ఈ) పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రీస్తు జయంతి నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రభు జన్మకు సంబంధించిన సంఘటనలను నాటక రూపంలో చూపించి సందర్శకులను ఆకట్టుకున్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫాదర్ చిన్నయ్య మాట్లాడుతూ, క్రీస్తు జయంతి లోకానికి ఒక మహత్తర పర్వదినమని తెలిపారు. ప్రభు జన్మ ద్వారా ప్రేమ, శాంతి, సమాధానం అనే విలువలు సమాజానికి అందాయని, వాటిని ప్రతి ఒక్కరూ తమ జీవనంలో ఆచరించి పొరుగు వారితో పంచుకోవాల్సిన అవసరం ఉందని సందేశం ఇచ్చారు.క్రిస్మస్ సందేశాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకలు పాఠశాల ప్రాంగణంలో ఉత్సాహభరిత వాతావరణాన్ని నెలకొల్పాయి.ఈ వేడుకల్లో ఫాదర్ కొలంబో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫాదర్ థామస్ కిరణ్‌తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .