అయ్యప్ప స్వామి  పూజలో పాల్గొన్న పరమేశ్వర్ రెడ్డి

అయ్యప్ప స్వామి  పూజలో పాల్గొన్న పరమేశ్వర్ రెడ్డి

మల్లాపూర్, డిసెంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు)

మల్లాపూర్ డివిజన్ నరసింహనగర్ కాలనీలో విక్రమాదిత్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజా కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజ అనంతరం పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి కటాక్షం ప్రజలందరిపై ఉండాలని, ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కప్పర సాయి గౌడ్, ఎస్.వి. కిట్టు, టిల్లు ముదిరాజ్, వల్లపు శ్రీకాంత్ యాదవ్, జానీ చారి, లడ్డు, ఫిరోజ్ ఖాన్, ప్రభు, హరీష్, వినీష్ యాదవ్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .