ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనుజ్ఞా రెడ్డి
Views: 6
On
వనపర్తి,డిసెంబర్28(తెలంగాణ ముచ్చట్లు)
వనపర్తి నియోజకవర్గ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వింగ్స్ క్రికెట్ క్లబ్ వనపర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన సీజన్–6 ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఘనంగా జరిగింది.ఈ ఫైనల్ మ్యాచ్‌కు వనపర్తి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనుజ్ఞా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడాకారుల పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించిన ఆమె, క్రీడలు యువతలో క్రమశిక్షణతో పాటు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో క్లబ్ నిర్వాహకులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మ్యాచ్‌ను ఆసక్తిగా వీక్షించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
08 Jan 2026 22:11:38
ఖమ్మం బ్యూరో, జనవరి 8(తెలంగాణ ముచ్చట్లు)
బీఆర్ఎస్ మాజీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం నాడు జిల్లాలో పర్యటించారు....


Comments