ఘనంగా పీజేఆర్ 18వ వర్ధంతి వేడుకలు
పాల్గొన్న రాష్ట్ర కార్మిక విభాగ ఆర్గనైజింగ్ సెక్రటరీ దయ్యాల దాసు
వనపర్తి,డిసెంబర్28(తెలంగాణ ముచ్చట్లు):
హైదరాబాద్ జూబ్లీహిల్స్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాటూరి రమేష్ ఆధ్వర్యంలో పీజేఆర్ 18వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లాకు చెందిన రాష్ట్ర కార్మిక విభాగ ఆర్గనైజింగ్ సెక్రటరీ దయ్యాల దాసు తో పాటు జిల్లాకు చెందిన నాయకులు పాల్గొన్నారు. అనంతరం జూబ్లీహిల్స్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాటూరి రమేష్ మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి పీజేఆర్ అని, పేదల కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
పీజేఆర్ ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, సామాన్యుల గుండెల్లో నిలిచిన నాయకుడిగా గుర్తుండిపోతారని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొంటూ, కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం ఎప్పటికీ అంకితభావంతో పనిచేస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దయ్యాల దాసు, భవాని రమేష్, గద్దల ప్రభాకర్, బోదాస్ నాగార్జున, గౌస్ బాయ్ సాయిలు, సత్యనారాయణ, బాలస్వామి, డి. రమేష్, నారాయణ, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments