ప్రపంచ స్థాయి విద్యా లక్ష్యంతో భారత్ ముందంజలో బిట్స్ పిలానీ

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

ప్రపంచ స్థాయి విద్యా లక్ష్యంతో భారత్ ముందంజలో బిట్స్ పిలానీ

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, జనవరి 09 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలను సాధించే దిశగా భారత్ చేస్తున్న ప్రయాణంలో బిట్స్ పిలానీ అగ్రగామిగా నిలుస్తోందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. బిట్స్ పిలానీకి చెందిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ‘బిట్సా గ్లోబల్ మీట్ – 2026 (బిజిఎం 26)’ ఆరో ఎడిషన్ శుక్రవారం హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సును గవర్నర్ అధికారికంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఎఫ్ సి ఏ) మరియు కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు కర్మాగారాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ (ఐఏఎస్), బీజీఎం 2026 ఛైర్‌పర్సన్ అనిత సాకూరు, బిట్స్ గ్రూప్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. రామగోపాల్ రావు, ఇన్వెంటస్ క్యాపిటల్ పార్టనర్స్ ఎంజెల్ ఇన్వెస్టర్ కన్వల్ రేఖి, బీజీఎం 2026 సీఈఓ మయూర్ పట్నాలా తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మను చౌదరి గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, బిట్స్ పిలానీ కేవలం విద్యా ప్రతిభకే పరిమితం కాకుండా నూతన ఆవిష్కరణలు, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, భయంలేని జిజ్ఞాసను తరతరాలుగా పెంపొందిస్తూ వస్తోందని ప్రశంసించారు. నేటి విద్యా రంగం కృత్రిమ మేధస్సు (ఏ I), డేటా సైన్స్, ఆటోమేషన్, డిజిటల్ మార్పులతో కీలక మలుపు తిరుగుతోందని పేర్కొన్నారు. ఏ I ఇక భవిష్యత్తు కల కాదని, ఇది ఇప్పటికే విద్య, పాలన, ఆరోగ్య రంగం, పరిశ్రమలను ప్రభావితం చేస్తోందన్నారు.
ఆI డేటాను విశ్లేషించగలదని, నిర్ణయాలు తీసుకోగలదని, అయితే మానవ విచక్షణ, నైతికత, సృజనాత్మకత, కరుణకు అది ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. విద్య లక్ష్యం యంత్రాలతో పోటీ పడటం కాదని, సమాజ హితానికి సాంకేతికతను దారి చూపే మానవ విలువలను బలోపేతం చేయడమేనని అన్నారు. ఈ దిశగా బిట్స్ పిలానీ స్వయం ప్రతిపత్తి, అనువైన పాఠ్య ప్రణాళికలు, అంతరశాఖీయ అధ్యయనం, ప్రాయోగిక విద్య ద్వారా ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర సాంకేతిక వ్యవస్థతో అనుసంధానమై ఆధునిక పదార్థాలు, బయోటెక్నాలజీ, వాతావరణ పరిష్కారాలు, రోబోటిక్స్, AI రంగాల్లో బిట్స్ విశేష పురోగతి సాధిస్తోందన్నారు. ఇలాంటి సంస్థలు భారత్‌ను కేవలం సాంకేతిక వినియోగదారుడిగా కాకుండా ఆవిష్కరణల సృష్టికర్తగా నిలబెడుతున్నాయని అన్నారు.పూర్వ విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ, వారి విజయాలే బిట్స్ పిలానీ వారసత్వానికి ప్రతీకలని అన్నారు. జాన్ ఎఫ్. కెన్నెడీ మాటలను ఉటంకిస్తూ, విశ్వవిద్యాలయాలకు పూర్వ విద్యార్థుల సంఘాలే ప్రాణవాయువని, వారి మార్గదర్శనం, దానధర్మాలు సంస్థ అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. యువతకు మార్గదర్శకులుగా నిలిచి, జాతీయ స్వయం సమృద్ధి సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.దాన కిశోర్ మాట్లాడుతూ సాంకేతికత, నాణ్యమైన విద్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. వర్క్‌ఫోర్స్ డెవలప్‌మెంట్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, నిరంతర అభ్యాసంలో బిట్స్ వంటి సంస్థలు జాతీయ భాగస్వాములుగా కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.IMG-20260109-WA0070IMG-20260109-WA0068
బీజీఎం 2026 ఛైర్‌పర్సన్ అనిత సాకూరు మాట్లాడుతూ, ఈ సదస్సు వివిధ తరాల మధ్య సహకారానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని అన్నారు. తొలి రోజు ముగింపులో సంప్రదాయ ఖవ్వాలీ ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .