రోడ్డు భద్రతపై కీసర పోలీసుల అవగాహన కార్యక్రమం

రోడ్ సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా కీసర ఎక్స్ రోడ్ వద్ద ర్యాలీ

రోడ్డు భద్రతపై కీసర పోలీసుల అవగాహన కార్యక్రమం

కీసర, జనవరి 9 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్ సేఫ్టీ వారోత్సవాల సందర్భంగా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కీసర ఎక్స్ రోడ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎ. అంజనేయులు హాజరై ప్రజలకు, విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ వినియోగించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.రోడ్డు ప్రమాదాలను నివారించడంలో యువత పాత్ర కీలకమని పేర్కొన్న ఇన్‌స్పెక్టర్, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు.అనంతరం శ్రద్ధ డిగ్రీ కాలేజ్ విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 100IMG-20260109-WA0059నుంచి 150 మంది విద్యార్థులు పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు బి. నాగరాజు, సి. హరి ప్రసాద్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .