మర్లపాడు వద్ద రోడ్డు ప్రమాదం.
అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన 108 సిబ్బంది.
సత్తుపల్లి, జనవరి 9 (తెలంగాణ ముచ్చట్లు):
వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొమ్మినేపల్లి నాగరాజు (36) మర్లపాడు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదుట రోడ్డుపై వెళ్తుండగా స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నాగరాజు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందగానే వేంసూరు మండల కేంద్రంలో సిద్ధంగా ఉన్న 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ తేనేటి మురళీకృష్ణ, పైలెట్ పెద్ద గౌడ ఏకాంత్ నాగరాజుకు అక్కడికక్కడే సీపీఆర్ నిర్వహించి, ఆక్సిజన్ అందించి, గాయాలకు కట్లు కట్టారు. అనంతరం ప్రథమ చికిత్స అందజేస్తూ సత్తుపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
నాగరాజు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో గోల్డెన్ అవర్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రోగ్రాం మేనేజర్ షేక్ నజీరుద్దీన్ ఆదేశాల మేరకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Comments