నాచారం సర్కిల్‌ను మల్లాపూర్ సర్కిల్‌గా పునర్వ్యవస్థీకరించాలి 

జిహెచ్ఎంసి కమిషనర్‌కు కార్పొరేటర్ల వినతి

నాచారం సర్కిల్‌ను మల్లాపూర్ సర్కిల్‌గా పునర్వ్యవస్థీకరించాలి 

నాచారం, డిసెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):

జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్‌ను మీర్పేట్ హౌసింగ్ బోర్డు కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి నాచారం సర్కిల్ కార్యాలయాన్ని మల్లాపూర్ సర్కిల్‌గా పునర్వ్యవస్థీకరించాలంటూ వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజా సౌలభ్యం దృష్ట్యా సర్కిల్ కార్యాలయాన్ని మల్లాపూర్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేయడం అత్యవసరమని కమిషనర్‌కు వివరించారు. మల్లాపూర్ ప్రాంతంలో వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణాభివృద్ధి, పరిపాలనా ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకుంటే ఈ మార్పు అవసరమని తెలిపారు.సర్కిల్ కార్యాలయం మల్లాపూర్‌లో ఏర్పాటు చేస్తే పరిపాలనా సామర్థ్యం మరింత పెరిగి, అధికారుల మధ్య సమన్వయం మెరుగవుతుందని, ప్రజల ఫిర్యాదులకు వేగంగా పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. అన్ని డివిజన్‌లకు కేంద్ర బిందువుగా మల్లాపూర్ సర్కిల్ ఉపయోగపడుతుందని కమిషనర్‌తో జరిగిన చర్చలో వారు స్పష్టం చేసినట్లు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్న‌లిస్టుల‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది జర్న‌లిస్టుల‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది
_జీవో 252లో మార్పులు – ఇండ్ల స్థలాలకు కోర్టు అడ్డంకులు లేని విధానం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం హైదరాబాద్‌ , జనవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):...
కొండా గోపి పుట్టినరోజు సందర్భంగా నాగులవంచలో రక్తదాన శిబిరం..
శ్రీ గ్లోబల్ హై స్కూల్ నాగులవంచలో ఘనంగా సంక్రాంతి సంబరాలు..
పాత్రికేయ విలువలకు నిలువెత్తు ప్రతీక  టీ.కే. లక్ష్మణ రావు
మీ నమ్మకాన్ని వొమ్ము చేయడం లేదు
సింగరేణి విశ్రాంతి కార్మికులకు కనీస పెన్షన్ పెంచాలి
యాదవులు రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలి