లోకవరం గ్రామ వాసికి రూ.2.50 లక్షల వైద్య సహాయం.

లోకవరం గ్రామ వాసికి రూ.2.50 లక్షల వైద్య సహాయం.

- పొంగులేటి సిఫారసుతో టీజీఐడిసి చైర్మన్ మువ్వా విజయబాబు చేతుల మీదుగా మంజూరు పత్రం.

సత్తుపల్లి, జనవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):

కల్లూరు మండలం లోకవరం గ్రామానికి చెందిన నున్నా మణి (భర్త: నున్నా కృష్ణయ్య) అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిఫారసుతో, టీజీఐడిసి చైర్మన్ మువ్వా విజయబాబు చొరవతో రాష్ట్ర ప్రభుత్వం రూ.2.50 లక్షల వైద్య సహాయ పత్రాన్ని మంజూరు చేసింది. ఈ సందర్భంగా మంజూరు పత్రాన్ని మువ్వా విజయబాబు బాధితురాలికి అందజేశారు. హైదరాబాద్‌లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థలో కొనసాగుతున్న చికిత్స విజయవంతంగా పూర్తై, ఆమె త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరాలని ఆకాంక్షించారు. బాధితురాలి పరిస్థితిని తెలుసుకుని వెంటనే స్పందించి వైద్య సహాయం మంజూరు చేయించి, ఆర్థికంగా అండగా నిలిచినందుకు మువ్వా విజయబాబుకు బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు మువ్వా విజయబాబు అభిమానులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏకశిలా నగర్ భూవివాదంపై ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు ఏకశిలా నగర్ భూవివాదంపై ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు
ల్యాండ్ మాఫియా–అధికారుల కుమ్మక్కు తక్షణమే ఆపాలి 24 గంటల్లో అరెస్టులు లేకపోతే ఉద్యమం ఉధృతం మేడ్చల్–మల్కాజ్గిరి , జనవరి 11 (తెలంగాణ ముచ్చట్లు)  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా...
రఘు నాథపాలెం మండలం వర ప్రదాయిని  మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్
జర్న‌లిస్టుల‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది
కొండా గోపి పుట్టినరోజు సందర్భంగా నాగులవంచలో రక్తదాన శిబిరం..
శ్రీ గ్లోబల్ హై స్కూల్ నాగులవంచలో ఘనంగా సంక్రాంతి సంబరాలు..
పాత్రికేయ విలువలకు నిలువెత్తు ప్రతీక  టీ.కే. లక్ష్మణ రావు
మీ నమ్మకాన్ని వొమ్ము చేయడం లేదు