ఏకశిలా నగర్ భూవివాదంపై ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు

ఏకశిలా నగర్ భూవివాదంపై ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు

ల్యాండ్ మాఫియా–అధికారుల కుమ్మక్కు తక్షణమే ఆపాలి

24 గంటల్లో అరెస్టులు లేకపోతే ఉద్యమం ఉధృతం

మేడ్చల్–మల్కాజ్గిరి , జనవరి 11 (తెలంగాణ ముచ్చట్లు) 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్‌లో జరుగుతున్న భూవివాదంపై పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఏకశిలా నగర్‌ను సందర్శించిన ఆయన బాధిత ప్లాట్ ఓనర్లను పరామర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడిన ఈటల రాజేందర్, 1985లో అప్పటి కొర్రేముల గ్రామ పరిధిలో 146 ఎకరాల్లో 2086 ప్లాట్లు ఏర్పాటు చేయగా, సింగరేణి, విద్యుత్ శాఖ ఉద్యోగులు, పాల వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు వంటి సామాన్య ప్రజలు స్థలాలు కొనుగోలు చేశారని తెలిపారు. అయితే రెవెన్యూ రికార్డుల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని వెంకటేష్ అనే వ్యక్తి ల్యాండ్ మాఫియాతో కలిసి 47 ఎకరాల భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నాడని ఆరోపించారు.డబ్బులకు ఆశపడి అప్పటి రెవెన్యూ అధికారులు, పోలీసులు గుండాలకు మద్దతు ఇచ్చారని విమర్శించారు. కాలనీవాసులు ఐక్యత లేకుండా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని, గుండాలు కొట్టడం, చంపుతామని బెదిరించడం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.గత సంవత్సరం ఇదే సమస్యపై తాను స్వయంగా వచ్చి డీజీపీ, కలెక్టర్, ఉన్నతాధికారులతో మాట్లాడానని, సమస్య పరిష్కారమైందని భావించినా మళ్లీ సర్వే పేరుతో అధికారులను పంపడం అన్యాయమన్నారు. వ్యవసాయ భూమి లేకుండా కేవలం ప్లాట్లే ఉన్నాయని స్పష్టంగా ఉన్నా, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వేకు రావడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు.
ఫ్లాట్ ఓనర్లపై గుండాలు దాడి చేయడం తీవ్రంగా ఖండనీయమని, వెంకటేష్‌తో పాటు అతనికి మద్దతిచ్చిన రెవెన్యూ, పోలీస్ అధికారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. 24 గంటల్లో వెంకటేష్‌పై హత్యా నేరం మోపి అరెస్ట్ చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు.ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించలేని పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. ధరణి అయినా, భూభారతి అయినా ల్యాండ్ మాఫియాలే రాజ్యమేలుతున్నాయని, హైదరాబాద్‌లో ప్లాట్ కొనాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.బాధితులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని, కార్యకర్తలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు అందరూ సహాయానికి సిద్ధంగా ఉన్నారని భరోసా ఇచ్చారు. ప్రజలు ఐక్యంగా ఉండాలని, కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.IMG-20260111-WA0087

Tags:

Post Your Comments

Comments

Latest News

కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం
జాతీయస్థాయి సీనియర్ కోకో పోటీలను ప్రారంభిస్తున్న మంత్రులు అనంతరం మాట్లాడుతున్న ఉత్తంకుమార్ రెడ్డి ముఖ్య అతిధులు గా హాజరైన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,...
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
మృతుని కుటుంబానికి మేఘన్న ఆర్థిక చేయూత
షైన్ హై స్కూల్ సంక్రాంతి సంబరాలు...
సంక్రాంతి సందర్భంగా  ముగ్గుల పోటీలు
కందుకూరులో మంత్రి తుమ్మల పర్యటన.!
ముమ్మర ప్రచారం భారీ ఏర్పాట్లు