జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు
Views: 2
On
వనపర్తి,జనవరి11(తెలంగాణ ముచ్చట్లు):
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు పాల్గొని వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వడ్డెర సంఘం నాయకులు మాట్లాడుతూ.. వడ్డే ఓబన్న వడ్డెర సమాజానికి ఆదర్శప్రాయుడని, ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సమాజ అభివృద్ధి, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటాన్ని ఈ తరం గుర్తుంచుకోవాలని అన్నారు.
వడ్డెర సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని నాయకులు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
11 Jan 2026 21:51:21
జాతీయస్థాయి సీనియర్ కోకో పోటీలను ప్రారంభిస్తున్న మంత్రులు అనంతరం మాట్లాడుతున్న ఉత్తంకుమార్ రెడ్డి
ముఖ్య అతిధులు గా హాజరైన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,...


Comments