ఎమ్‌పీజే నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
ఖమ్మం బ్యూరో, జనవరి 11(తెలంగాణ ముచ్చట్లు)
మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపీజే) సంస్థ రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, సమాజంలో శాంతి, న్యాయం, సామరస్యాన్ని పెంపొందించడంలో మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపీజే) సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ప్రజల్లో మానవ విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించే కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీజే రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఖాసిం, జిల్లా కోశాధికారి ఎండి హకీమ్, సెక్రటరీ ఎండి రజబ్ అలీ, మాజీ సిటీ లైబ్రరీ చైర్మన్ ఎండి అశ్రిఫ్, బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్, కాంగ్రెస్ లీడర్ ఎండి సాద్, ఎంపీజే జిల్లా సభ్యులు ఎస్.కె హుస్సేన్ మియా, సయ్యద్ ఇస్మాయిల్, ఎస్ కే జానీ, ఎస్ డి రఫీక్, తదితరులు పాల్గొన్నారు


Comments