సూరారం గ్రామంలో ఆటో యూనియన్ నూతన కమిటీ ఏర్పాటు

సూరారం గ్రామంలో ఆటో యూనియన్ నూతన కమిటీ ఏర్పాటు

ఎల్కతుర్తి, జనవరి 11:( తెలంగాణ ముచ్చట్లు) 

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో ఆటో యూనియన్ నూతన కమిటీని ఆదివారం అధికారికంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి రమేష్, ఎల్కతుర్తి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అక్కినేపల్లి ప్రవీణ్ కుమార్లను మర్యాదపూర్వకంగా కలిసి అభివాదం చేశారు.
ఈ సమావేశంలో యూనియన్ కమిటీ బాధ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా హింగే భాస్కర్, అధ్యక్షుడిగా మౌటం చంద్రమౌళి, ఉపాధ్యక్షుడిగా బుగ్గ తిరుపతి, కార్యదర్శిగా వేముల రమేష్, సహ కార్యదర్శిగా గడ్డం రమేష్, ప్రచార కార్యదర్శిగా ఎండి ఇమ్రాన్ (చోటు)లను నియమించారు.
అలాగే కమిటీ సభ్యులుగా చల్లూరి వేణు, భాస్కర్, సదానందం, సంపత్, రమేష్, ఎండి హజ్ ఇమ్రాన్, మల్లేశం, ప్రవీణ్, సదాశివుడు, సురేష్, వెంకటేష్, శంకర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తామని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి రమేష్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అక్కినేపల్లి ప్రవీణ్ కుమార్ యూనియన్ సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం
జాతీయస్థాయి సీనియర్ కోకో పోటీలను ప్రారంభిస్తున్న మంత్రులు అనంతరం మాట్లాడుతున్న ఉత్తంకుమార్ రెడ్డి ముఖ్య అతిధులు గా హాజరైన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,...
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
మృతుని కుటుంబానికి మేఘన్న ఆర్థిక చేయూత
షైన్ హై స్కూల్ సంక్రాంతి సంబరాలు...
సంక్రాంతి సందర్భంగా  ముగ్గుల పోటీలు
కందుకూరులో మంత్రి తుమ్మల పర్యటన.!
ముమ్మర ప్రచారం భారీ ఏర్పాట్లు