కీసరలో ఘనంగా 205వ వారం జ్ఞానమాల కార్యక్రమం
అణగారిన వర్గాలకు సమానత్వం అందించిన మహనీయుడు అంబేద్కర్: శ్రద్ధ, స్ఫూర్తి కళాశాల ఎండి మధార్
కీసర, జనవరి 11 (తెలంగాణ ముచ్చట్లు):
సామాజిక విప్లవ మహోపాధ్యాయుడు, భారత రాజ్యాంగ నిర్మాత డా. బీ.ఆర్. అంబేద్కర్ లేకపోతే ఈ దేశం చీకట్లో మగ్గేదని కీసర శ్రద్ధ, స్ఫూర్తి కళాశాలల చైర్మన్ ఎండి. మధార్ పేర్కొన్నారు.కీసర మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కర్రె గణేష్, ప్రధాన కార్యదర్శి మంచాల సంజీవ్ ఆధ్వర్యంలో ఆదివారం 205వ వారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎండి. మధార్ మాట్లాడుతూ, కోట్లాది మంది అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపి, అక్షరాన్ని ఆయుధంగా మలిచిన మహనీయుడు డా. అంబేద్కర్ అని కొనియాడారు.కుల రక్కసి చీకట్లను చీల్చి భారత ప్రజలకు సమానత్వం, ప్రజాస్వామ్యాన్ని అందించిన యోధుడు అంబేద్కర్ అని మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కర్రె గణేష్ అన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో జ్ఞానమాల కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.సుమారు 580 మంది కళాశాల విద్యార్థులతో కలిసి కార్యక్రమానికి హాజరైన ఎండి. మధార్, అంబేద్కర్ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించారు. అంబేద్కర్ కృషివల్లే నేడు అణగారిన వర్గాలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నాయని, నేటి యువత ఆయనను ఆదర్శంగాu తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు.పెద్ద ఎత్తున విద్యార్థులు తరలిరావడంతో కీసర ప్రధాన చౌరస్తా పండుగ వాతావరణాన్ని తలపించింది. కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథికి అంబేద్కర్ చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా మండల కమిటీ పోలీసుల సహకారంతో ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు గోరంటి ప్రవీణ్, పులిపాక తిరుపతి, కోశాధికారి రొండ్ల మహేష్, సంయుక్త కార్యదర్శులు తాళ్ల కిరణ్, కుర్రి పరమేష్, మంచాల మహేష్, ఎంకిరాల నర్సింగ్ రావు, ముఖ్య సలహాదారులు రొండ్ల కృష్ణ, చినింగని ఆనంద్ రావు, మంగళపురి వెంకటేష్, రాగుల రమేష్ ముదిరాజ్‌తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధ్యాపక బృందం, నాయకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.


Comments