కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం
ముఖ్య అతిధులు గా హాజరైన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,
వాకటి శ్రీహరి .
వివిధ రాష్టాల నుండి వచ్చిన క్రీడాకారులు
కాజీపేట్ జనవరి 11 (తెలంగాణ ముచ్చట్లు)
కాజీపేట్ పట్టణంలోని రైల్వే స్టేడియం లో ఆదివారం సాయంత్రం 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలను రాష్ట్ర మంత్రి లు ఉత్తమ్ కుమార్ రెడ్డి , వాకిటి శ్రీహరి, తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్,తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ జంగా రాఘవ రెడ్డి కలసి ప్రారంభించారు.
ముందుగా వారు క్రీడాపతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం వివిధ రాష్ట్రాల జట్ల క్రీడాకారులతో కలసి మార్చ్‌పాస్ట్ నిర్వహించి మంత్రులకు గౌరవవందనం సమర్పించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యువత,విద్యార్థులు చదువు తో పాటు క్రీడల పై ద్రుష్టి పెట్టాలని,ఖోఖో పోటీలు ఖాజీపేట లో ప్రారంభం కావడం మంచి పరిణామం అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం క్రీడాలకు అత్యదిక ప్రాధాన్యతనిస్తుందని మంత్రులు తెలిపారు.
తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ జంగా రాఘవ రెడ్డి గారు మాట్లాడుతూ వరంగల్,కాజీపేట ప్రాంతం క్రీడలకు పుట్టినిల్లు అని ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు తయారు చేసిన ఘనత వరంగల్ కు దక్కుతుందని అన్నారు.
అంత్యంత ప్రతిష్టత్మకంగా ఈ క్రీడాలను నిర్వహణ భాద్యతలను గౌరవ తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్,తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ జంగా రాఘవ రెడ్డి గారు ముందుండి నిర్వహించడం మంత్రులు క్రీడాభిమానులు జంగా రాఘవ రెడ్డికి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాదవ రెడ్డి ,భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారణ,ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్య, స్పోర్ట్స్ చైర్మన్ శివశేనా రెడ్డి , దేశ నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులు లతోపాటు తదితరులు పాల్గొన్నారు.



Comments