కార్పొరేటర్ భర్త పై దాడి కేసు కుట్రనేనా.
ఎమ్మెల్యే అనుచరుల భూ దందా కు సహకరించని కార్పొరేటర్ భర్త.
3 కోట్ల భూమి ఎసరు పెట్టిన అనుచరులు.
ఆ అధ్యక్షుడు వివాదల కేంద్రం.
హాసన్ పర్తి, డిసెంబర్ 29(తెలంగాణ ముచ్చట్లు):
కార్పొరేటర్ భర్త పై దాడి కేసు నమోదు చేయడం కుట్ర లో భాగమేనని కార్పొరేటర్ భర్త జక్కుల వెంకటేశ్వర్లు సోమవారం మీడియాతో ఒక ప్రకటన లో అన్నారు. తన వర్గానికి చెందిన కాలనీలో ప్రధాన కార్యదర్శి ఇంటి వరకు రోడ్డు పనులు చేయడం లేదన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన తన పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి దుర్భాషలాడిన క్రమంలో జరిగిన చిన్న సంఘటన నియోజకవర్గ ఎమ్మెల్యే అనుచరులు కావాలనే రాజకీయంగా అణగదొక్కడానికి వేసిన భారీ స్కెచ్ అని అన్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మారిన తాను డివిజన్ అభివృద్ధి చేయకుండా తమ సొంత ప్రయోజనాల కోసం పనిచేయాలని ఒత్తిడి చేస్తూ మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నుంచి మంజూరు చేయించిన తమకు తెలియకుండా అభివృద్ధి జరగకూడదని ఎమ్మెల్యేతో ఒత్తిడి చేయించినట్లు తెలిపారు.
ఎమ్మెల్యే అనుచరుల భూదంద కు అడ్డుగా ఉన్నాడని కేసు నమోదు.
నక్షత్ర కాలనీ ని అనుకుని ఉన్న వెంచర్ లో భూ వివాదం ఉన్న ప్లాట్ లో ఎమ్మెల్యే అనుచరులు చొరబడి అక్రమంగా వారిని బెదిరించి మూడు కోట్ల భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ విషయంలో కార్పొరేటర్ భర్త తమకు సహకరించడం లేదని నానా రకాలుగా వేధింపులకు గురిచేసి,కేసులు నమోదు చేసే ప్రయత్నంతో ఇలాంటి కేసుల లో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉండి,ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే నన్ను ఇలాంటి కేసులు ఏమి చేయలేవని ప్రజలందరికీ అన్ని విషయాలు అర్థం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బాలానగర్ గా నామకరణం(602/2022)
1986 సంవత్సరంలో బాలయ్య,నాగయ్య జ్ఞాపకార్థం అక్కడ ఓ వెంచర్ చేయడం జరిగిందని 2018,2019, 2020 సంవత్సరాలలో పలువురు కొన్ని ఇండ్లు నిర్మాణం చేసుకొని కాలనీవాసులు నక్షత్ర కాలనీ అని పేరు పెట్టుకున్నారని అదే క్రమంలో అప్పట్లో 2021లో కార్పొరేటర్ కాలనీ వాసుల తో ఆ కాలనీ నుండి పక్క కాలనీకి రోడ్డు కోసం తన సొంత ఖర్చులతో తొమ్మిది లక్షల రూపాయలు తో ఓ ప్లాట్ కొని రోడ్డు వేసే విధంగా మిగిలిన స్థలంలో కాలనీకి కమ్యూనిటీ హాల్ నిర్మించే విధంగా ఒప్పందం చేసుకుని కాలనీ పేరు బాలనగర్( రిజిస్ట్రేషన్ నెంబర్ 602/2022)గా మార్చడానికి అంగీకరించారని తెలిపారు.కొత్త ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే అనుచరులు పాత కాలనీ అధ్యక్షున్ని తప్పించి తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తి ని నూతన అధ్యక్షునిగా పెట్టుకుని సుమారు 3కోట్ల విలువైన ఆ భూమిని కాజేసేందుకు తన మీద కేసులు వేసి అనేక ఆరోపణలు చేస్తూ రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
ఆ అధ్యక్షుడు వివాదాలకు కేంద్రం.
నక్షత్ర కాలనీ( బాలనగర్) కాలనీలో అధ్యక్షుడిగా కొనసాగుతున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు రియల్ ఎస్టేట్ వ్యవపారాలు చేస్తూ ఆ చుట్టుపక్కల కాలనీలలో ఆ ప్రాంతంలో పలు భూ వివాదాలకు,పంచాయతీలకు కేంద్రంగా మారారని చుట్టుపక్కల కాలనీవాసులు పలువురు తెలుపారని నక్షత్ర కాలనీ పక్కన గల సుమారు మూడు కోట్ల విలువగల భూమిలో పలు వివాదాస్పద ప్లాట్లను కొందరి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి అమ్మినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో పలువురు ఆ అధ్యక్షునిపై కేయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులపై ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు.


Comments