మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మేఘన్న అభయహస్తం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మేఘన్న అభయహస్తం

పెద్దమందడి,జనవరి10(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన సుర కొండన్న (62) అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడం జరిగింది.విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు మృతుని నివాసానికి చేరుకుని భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.పేద కుటుంబాలకు అండగా నిలిచే మేఘన్న అభయహస్తం కార్యక్రమం ద్వారా మృతుని కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.5,000/-రూపాయల ఆర్థిక సాయం అందజేసి కుటుంబానికి ధైర్యం చేకూర్చారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులు తమ కష్టకాలంలో స్పందించి ఆర్థిక సహాయం అందేలా చేసిన వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ ప్రజల కష్టాల్లో భాగస్వాములై, పెద్దమందడి మండలంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సూర్య గంగా రవి, వార్డ్ మెంబర్ వాకిటి రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాకిటి నరేష్, నందిమల్ల కురుమన్న, త్రినాథ్, చిన్న మన్యం, బోయ స్వామి, గట్టు రాజశేఖర్, సుర వెంకటస్వామి, వహీద్ (పాపా), కొత్త సురేష్, గొడుగు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. మృతుని కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని నాయకులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .