నూతన ఎస్సై జలంధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు నత్తి మన్నెం
పెద్దమందడి,జనవరి10(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన జలంధర్ రెడ్డిని మద్దిగట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నత్తి మన్నెం శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీస్ శాఖతో సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నాయకులు మన్నెం పేర్కొన్నారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలంటే ప్రజలు, పోలీసుల మధ్య సమన్వయం మరింత బలపడాలని అభిప్రాయపడ్డారు.నూతన ఎస్సై జలంధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల భద్రతే తన ప్రధాన లక్ష్యమని, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారంతో మండలంలో శాంతిభద్రతలు మరింత పటిష్టం చేస్తామని తెలిపారు.


Comments