మధర్ తెరిస్సా టెక్నో స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు.!

పాఠశాల చిన్నారులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మట్టా రాగమయి.

మధర్ తెరిస్సా టెక్నో స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు.!


IMG-20260110-WA0040

సత్తుపల్లి,జనవరి10(తెలంగాణ ముచ్చట్లు): సత్తుపల్లి పట్టణంలోని మధర్ తెరిస్సా టెక్నో స్కూల్‌లో శనివారం సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మట్టా రాగమయి పాల్గొని పాఠశాల చిన్నారులతో కలిసి పండుగ వేడుకల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు, విద్యార్థులకు ముందస్తుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులతో కలిసి బోగి మంటల వద్ద ఆటలు, పాటల కార్యక్రమాల్లో పాల్గొని, చిన్నారులతో కోలాటం ఆడారు. హరిదాస్ వేషధారణలో ఉన్న చిన్నారులను అభినందించి వారి ప్రతిభను ప్రశంసించారు.
ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, నియోజకవర్గంలోని విద్యార్థులు చదువులో ముందుండాలని ఆకాంక్షించారు. సంక్రాంతి సెలవుల్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .