గంగవరం రామకృష్ణారెడ్డి రచించిన “ఖాళీ కుర్చీ” కవితా
సంపుటి ఆవిష్కరించిన మాజీమంత్రి
వనపర్తి,డిసెంబర్28(తెలంగాణ ముచ్చట్లు):
గంగవరం రామకృష్ణారెడ్డి రచించిన “ఖాళీ కుర్చీ” కవితా సంపుటి ఆవిష్కరణ వనపర్తి టి.ఎన్.జి.ఓ భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. సరళమైన భాషలో సున్నితమైన సామాజిక అంశాలను స్పృశిస్తూ రచించిన "ఖాళీ కుర్చీ” కవితా సంపుటి అభినందనీయమని అన్నారు. వాగ్దానాల భంగానికి, అధికార ధర్మానికి ‘ఖాళీ కుర్చీ’ మౌన సాక్షిగా నిలుస్తుందని, ప్రజాప్రతినిధులు సామూహిక బాధ్యతలను గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు.కవితా సంపుటి చిన్నదైనా లోతైన అర్థంతో సమాజానికి మంచి సందేశం ఇస్తుందని తెలిపారు. రచయిత గంగవరం రామకృష్ణారెడ్డి మరింత మంచి రచయితగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ సభ సాహితీ కళా వేదిక అధ్యక్షులు పలుస. శంకర్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో
మాజీ జెడ్‌పి చైర్మెన్ లోక్‌నాథ్ రెడ్డి, డా. వీరయ్య, నారాయణరెడ్డి, డా. సురేష్ విశ్వ, నాయకంటి నరసింహ శర్మ, బైరోజు చంద్రశేఖర్, గంధం నాగరాజు, నందిమల్ల అశోక్, ప్రేమ్‌నాథ్ రెడ్డి, సుగురు మురళీ సాగర్, జోహెబ్ హుస్సేన్, మంద రాము తదితరులు పాల్గొన్నారు.


Comments