కల్లూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.!

కల్లూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.!

- పులిగుండాలను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం.

- గ్రామాల సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి.

కల్లూరు, డిసెంబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు):

గ్రామాల సర్వతోముఖాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పర్యాటక రంగ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
బుధవారం కల్లూరు మండలంలో పర్యటించిన మంత్రి, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా పేరువంచ గ్రామం నుంచి కుప్పనకుంట్ల వరకు రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు రూ.2 కోట్లతో నారాయణపురం – పేరువంచ, రూ.4 కోట్లతో నారాయణపురం నుంచి కొర్లగూడెం ఆర్ అండ్ బి రోడ్ ద్వారా రామకృష్ణపురం వరకు, రూ.2 కోట్లతో కొత్త నారాయణపురం నుంచి ఎన్ఎస్పీ కాలువ లిఫ్ట్ వరకు బీటీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
మంత్రి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతోందన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి అవసరమైన రోడ్లు, మౌలిక వసతులు వందకు వంద శాతం కల్పిస్తామని చెప్పారు. పేదలకు సన్నబియ్యం సరఫరా, కొత్త రేషన్ కార్డులు, పాత కార్డుల్లో పేర్ల చేర్పు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గురుకులాల్లో డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రైతుల రుణమాఫీ కింద ప్రభుత్వం తొలి తొమ్మిది నెలల్లోనే రూ.21 వేల కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద తొలి విడతలో 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేయగా, వచ్చే ఏప్రిల్ నుంచి రెండో విడత మంజూర్లు చేపడతామన్నారు.
అనంతరం కల్లూరు మండల పరిషత్ ఆవరణలో నూతనంగా నిర్మించిన వన సంరక్షణ సమితి సమావేశ మందిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కనకగిరి – పులిగుండాల అటవీ ప్రాంతం సుమారు 35 వేల ఎకరాల్లో విస్తరించి ఉందని, అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అడవులను కాపాడుకుంటూనే స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పించేలా ఎకో టూరిజం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వన సంరక్షణ సమితుల ఆర్థికాభివృద్ధి కోసం ఒక సమితిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. పులిగుండాల పర్యాటక విహారానికి రెండు వాహనాలను ప్రారంభించి, సమితి సభ్యులకు కుటీర పరిశ్రమల యూనిట్లు అందజేశారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్, కల్లూరు ఏఎంసీ చైర్‌పర్సన్ భాగం నీరజ, ఆర్ అండ్ బి, పీఆర్, వ్యవసాయ, మిషన్ భగీరథ శాఖలఅధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.IMG-20251231-WA0114

Tags:

Post Your Comments

Comments

Latest News

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు): భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ
జమ్మిగడ్డలో బిఆర్‌ఎస్ నాయకురాలు శేరి మణెమ్మ సేవా కార్యక్రమం
మున్నూరు కాపులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకుసాగాలి  పుట్ట పురుషోత్తం రావు
పెద్ద చెరువుకట్టపై శుభ్రత పనులను పరిశీలిం చిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
అభివృద్ధే శ్వాసగా పనిచేయండి
పదేళ్లలో పేదోడికి గూడు ఇవ్వని దౌర్భాగ్య ప్రభుత్వం