క్రీడలతో పల్లె నుంచి ప్రపంచ స్థాయి గుర్తింపు సాధ్యం

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

క్రీడలతో పల్లె నుంచి ప్రపంచ స్థాయి గుర్తింపు సాధ్యం

పెద్దమందడి,జనవరి10(తెలంగాణ ముచ్చట్లు):

క్రీడల ద్వారా పల్లె స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు గుర్తింపు పొందవచ్చని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. యువత, విద్యార్థులు ఉన్నత విద్యతో పాటు క్రీడలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి రాణించాలని ఆయన సూచించారు.శనివారం పెద్దమందడి మండల కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామ క్రీడాకారుడు స్వర్గీయ పవన్ కుమార్ జ్ఞాపకార్థం నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, గ్రామీణ స్థాయిలో నిర్వహించే ఇలాంటి క్రీడా పోటీలతో యువతలో స్నేహభావం పెంపొందుతుందని, శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు.క్రికెట్ ఆడుతూ నాగర్‌కర్నూల్‌లోని మైదానంలో కుప్పకూలి మృతి చెందిన క్రీడాకారుడు స్వర్గీయ పవన్ కుమార్ జ్ఞాపకార్థం ఈ పోటీలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొంటూ నిర్వాహకులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రశంసించారు. క్రీడల నిర్వహణకు సహకరించిన యువకులు, గ్రామ పెద్దలను కూడా ఆయన అభినందించారు.క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి, జన్మనిచ్చిన గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఆయన స్వయంగా క్రికెట్ ఆడి పోటీలను ప్రారంభించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగా రవి, జిల్లా యూత్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, మాజీ సర్పంచ్ వెంకటస్వామి, మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సత్య రెడ్డి, మణిగిల్ల మాజీ సర్పంచ్ కొండా రవీందర్ రెడ్డి, పెద్దమందడి మాజీ ఉపసర్పంచ్ జావేద్, న్యాయవాది త్రినాథ్, రాఘవేందర్, నరేష్ తదితర నాయకులు, కార్యకర్తలు, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.IMG-20260110-WA0045

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .