క్రీడలతో ఐక్యత, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డి
పెద్దమందడి,జనవరి10(తెలంగాణ ముచ్చట్లు):
క్రీడలు మనుషుల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని పెద్దమందడి ఎస్సై యుగంధర్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని మండలంలోని జగత్‌పల్లి గ్రామంలో జగత్‌పల్లి ప్రీమియర్ లీగ్ పేరిట నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను స్థానిక సర్పంచ్ పెంటన్న యాదవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.సర్పంచ్ బంతిని విసరగా ఎస్సై బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.ఈ సందర్భంగా ఎస్సై యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ.. నేటి యువత మద్యానికి, మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే దిశగా నడుచుకోవాలని సూచించారు. పండగలు, ప్రత్యేక రోజుల్లో క్రీడా పోటీలు నిర్వహించడం శుభ పరిణామమని పేర్కొన్నారు.క్రీడల వల్ల ఐక్యతతో పాటు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం పెరుగుతాయని తెలిపారు.క్రీడా ప్రాంగణాల్లో స్వాగత ఫ్లెక్సీలకంటే హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, మద్యం సేవించి లేదా ధూమపానం చేసి వాహనాలు నడపవద్దని అవగాహన కల్పించే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. యువత ఉన్నత చదువులు చదివి జీవిత ఆశయాలను సాధించాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారు, గ్రామాల్లో గొడవలు సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తానని, ఎంతటి పెద్దలతో చెప్పించినా వినే ప్రసక్తే లేదని హెచ్చరించారు.అనంతరం జగత్‌పల్లి ప్రీమియర్ లీగ్ నిర్వాహకులు ఎస్సై యుగంధర్ రెడ్డి, సర్పంచ్ పెంటన్న యాదవ్‌లతో పాటు గ్రామస్తులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంటన్న యాదవ్, మణిగిల్ల సర్పంచ్ పనస శ్రీనివాస్ గౌడ్, గ్రామస్తులు శ్రీనివాస యాదవ్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ మన్యంకొండ యాదవ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ నాయుడు, భాస్కర్ యాదవ్, రాజు యాదవ్, రాములు యాదవ్, గౌనికాడి వెంకటేష్ యాదవ్, జానంపేట తిరుపతి నాయుడు, నిర్వాహకులు శివ యాదవ్, ధోని, బాలరాజు, వెంకటేష్ సాగర్, ప్రవీణ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.


Comments