శ్రీ గ్లోబల్ హై స్కూల్ నాగులవంచలో ఘనంగా సంక్రాంతి సంబరాలు..

శ్రీ గ్లోబల్ హై స్కూల్ నాగులవంచలో ఘనంగా సంక్రాంతి సంబరాలు..

ఖమ్మం బ్యూరో, జనవరి 10(తెలంగాణ ముచ్చట్లు)

చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గ్లోబల్ హైస్కూల్లో సంక్రాంతి పండుగను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని పండుగ వాతావరణంతో అలంకరించారు. విద్యార్థులు రంగురంగుల సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. సంక్రాంతి ప్రత్యేకతను తెలియజేసే విధంగా భోగిమంటలు ఏర్పాటు చేసి పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. బాలికలు సాంప్రదాయ నృత్యాలు, అలంకరణతో పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. గ్రామీణ సంస్కృతి ప్రతిబింబించే కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల ఆవరణాన్ని రంగురంగుల ముగ్గులతో అలంకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల్లోభారతీయ సాంప్రదాయాలపై అవగాహన పెంపొందించడమే ఇలాంటి వేడుకల లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆనందం, ఉత్సాహాన్ని నింపిందని ప్రశంసించారు.IMG-20260110-WA0095

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .