మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కోర్టు ఆవరణలో మూడు కొత్త కోర్టులు ప్రారంభం

మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కోర్టు ఆవరణలో మూడు కొత్త కోర్టులు ప్రారంభం

కుషాయిగూడ, డిసెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కోర్టు ఆవరణలో న్యాయసేవలను మరింత విస్తరించేందుకు మరో మూడు కోర్టులు నూతనంగా అందుబాటు లోకి వచ్చాయి. ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు, అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులను హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కోర్టు సీనియర్ జడ్జి శ్రీదేవి, జిల్లా కలెక్టర్ మనో చౌదరి, మల్కాజ్గిరి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి తదితర న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జస్టిస్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ, త్వరలోనే మల్కాజ్గిరి కోర్టు అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణంలో ఉన్న నూతన భవనంలోకి మారుతుందని తెలిపారు. కోర్టుల సంఖ్య పెరగడం వల్ల కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని, ప్రజలకు న్యాయం త్వరగా అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.అనంతరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి న్యాయవాదులు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన జస్టిస్ లక్ష్మణ్, అడ్వకేట్ల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ మూడు కొత్త కోర్టుల ప్రారంభం కీలక ముందడుగుగా అధికారులు అభిప్రాయపడ్డారు.IMG-20251229-WA0113IMG-20251229-WA0114

Tags:

Post Your Comments

Comments

Latest News

సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొన్న నెమలి అనిల్ కుమార్ సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొన్న నెమలి అనిల్ కుమార్
మల్లాపూర్, జనవరి 11 (తెలంగాణ ముచ్చట్లు): సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మల్లాపూర్ డివిజన్ నాగలక్ష్మి నగర్ కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా...
ముగ్గులు మన సంస్కృతికి ప్రతీక పనగట్ల చక్రపాణి గౌడ్
జయగిరిలో సంక్రాంతి సంబరాలు.
క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
సూరారం గ్రామంలో ఆటో యూనియన్ నూతన కమిటీ ఏర్పాటు
కీసరలో ఘనంగా 205వ వారం జ్ఞానమాల కార్యక్రమం
కట్ట మైసమ్మ గుడి ఘటనతో నేరేడ్మెట్‌లో ఉద్రిక్తత