ముగ్గులు మన సంస్కృతికి ప్రతీక పనగట్ల చక్రపాణి గౌడ్
కుషాయిగూడ, జనవరి 11 (తెలంగాణ ముచ్చట్లు):
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం కుషాయిగూడ శుభోదయ కాలనీ ఫేజ్–1 మరియు ఫేజ్–2లలో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాలనీల అసోసియేషన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో, పనగట్ల చక్రపాణి గౌడ్ నేతృత్వంలో నిర్వహించారు.ముగ్గుల పోటీల్లో వందలాది మహిళలు పాల్గొని తమ కళా నైపుణ్యాన్ని అద్భుతమైన ముగ్గుల రూపంలో ప్రదర్శించారు. పోటీల్లో గెలుపొందిన మహిళలకు పనగట్ల చక్రపాణి గౌడ్ సతీమణి ప్రసన్న గౌడ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా పనగట్ల చక్రపాణి గౌడ్ మాట్లాడుతూ, “ముగ్గు అనేది కేవలం ఇంటి ముందు వేసే అలంకరణ మాత్రమే కాదు, అది మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ఈ సంప్రదాయాన్ని మన పిల్లలకు, రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది” అని అన్నారు. గెలుపొందిన మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్యక్రమానికి సహకరించిన రెండు కాలనీల అసోసియేషన్ సభ్యులు మరియు కాలనీ పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శుభోదయ కాలనీ ఫేజ్–1 పెద్దలు చెంచు రెడ్డి, అధ్యక్షులు మల్లేష్, రవి చారి; శుభోదయ కాలనీ ఫేజ్–3 పెద్దలు కాసుల నందం గౌడ్, కాలనీ అధ్యక్షులు తిగుళ్ల రాంచందర్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, సిద్ద రాములు, భాను, ప్రధాన కార్యదర్శి మల్లేష్, కమిటీ సభ్యులు బాలరాజు గౌడ్, కృష్ణ, రమేష్ బాబు, ప్రసాద్ కృష్ణ, రమేష్, శ్రీకాంత్ గౌడ్; మహిళా సభ్యులు శోభారాణి, రమాదేవి; మాజీ అధ్యక్షుడు వీర నారాయణ రెడ్డి, లక్ష్మీనారాయణ గౌడ్, శెట్టి రాఘవేందర్, పల్లె కృష్ణ రెడ్డి, షాలిని, మాధవి, బన్నాపురం నాగరాజు, నీరుడు బాబు, రాంగిరివార్ నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.


Comments