పార్టీలకతీతంగా పనిచేస్తే మున్ననూర్‌ను జిల్లాకే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

ఎమ్మెల్యే మేఘారెడ్డి

పార్టీలకతీతంగా పనిచేస్తే మున్ననూర్‌ను జిల్లాకే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

గోపాల్పేట,జనవరి11(తెలంగాణ ముచ్చట్లు):

గ్రామాభివృద్ధికి పార్టీలకతీతంగా అందరూ కలిసి పనిచేస్తే మున్ననూర్ గ్రామాన్ని ఒకే ఒక్క సంవత్సరంలో జిల్లాకే ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం గోపాల్పేట మండలం మున్ననూర్ గ్రామంలో నిర్వహించిన ఉదయపు నడకలో ఆయన అన్ని శాఖల అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.గ్రామంలోని వీధుల గుండా పర్యటిస్తూ గ్రామస్తులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే, పలు సమస్యలను అక్కడికక్కడే అధికారులతో చర్చించి తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో విద్యాభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తూ, పాఠశాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫున రూ. కోటి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.గ్రామపంచాయతీకి పక్క భవన నిర్మాణం, పల్లె దవాఖాన ఏర్పాటు, సీసీ రోడ్లు, మురికి కాలువలు, విద్యుత్ సమస్యల పరిష్కారం, తాగునీటి సౌకర్యాల కల్పన, మున్ననూర్ నుంచి ఏదుట్ల, కాశీంనగర్ గ్రామాలకు రోడ్ల నిర్మాణం, శివాలయంలో కళ్యాణ మండపం, ఆర్టీసీ బస్సు సర్వీసుల పునరుద్ధరణ, అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, మహిళా సంఘ భవనం, ఇందిరా కాలనీలో ప్లాట్ల సమస్య పరిష్కారం, కుల సంఘాలకు సామూహిక భవనాల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు.గ్రామ సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, ఎంపీపీగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా గ్రామ సమస్యలన్నింటిపై అవగాహన ఉందని తెలిపారు. తన సొంత గ్రామం మంగంపల్లిలో పూర్తి అభివృద్ధి సాధించినట్టే మున్ననూర్ గ్రామాన్ని కూడా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేలా కృషి చేస్తానని అన్నారు. గత పాలకుల విషయాలు పక్కనపెట్టి, భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అందరూ ముందుకు సాగాలని గ్రామస్తులకు సూచించారు.ప్రస్తుతం ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు గ్రామానికి పెద్దలుగా బాధ్యతతో పనిచేసి గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్ననూర్ గ్రామ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, గ్రామ సర్పంచ్ మమత, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, గోపాల్పేట ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ సత్య శీలా రెడ్డి, మండల మత్స్య సహకార సంఘం అధ్యక్షులు సత్యం, గ్రామ అధ్యక్షుడు ధీర మల్లు, యూత్ అధ్యక్షుడు IMG-20260111-WA0159శశికుమార్, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం
జాతీయస్థాయి సీనియర్ కోకో పోటీలను ప్రారంభిస్తున్న మంత్రులు అనంతరం మాట్లాడుతున్న ఉత్తంకుమార్ రెడ్డి ముఖ్య అతిధులు గా హాజరైన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,...
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
మృతుని కుటుంబానికి మేఘన్న ఆర్థిక చేయూత
షైన్ హై స్కూల్ సంక్రాంతి సంబరాలు...
సంక్రాంతి సందర్భంగా  ముగ్గుల పోటీలు
కందుకూరులో మంత్రి తుమ్మల పర్యటన.!
ముమ్మర ప్రచారం భారీ ఏర్పాట్లు