ఫ్రీ ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగావకాశం

ఎల్.జి. కంపెనీ సెంట్రల్ మేనేజర్ సంగ్రం కిశోర్

ఫ్రీ ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగావకాశం

కుషాయిగూడ, డిసెంబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు)

ఉద్యోగాలు లేని యువతీ యువకులకు ఎల్.జి. కంపెనీ సువర్ణావకాశం కల్పిస్తోందని ఆ కంపెనీ సెంట్రల్ మేనేజర్ సంగ్రం కిశోర్ తెలిపారు. మంగళవారం కమలా నగర్‌లోని ఎల్.జి. ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు.10వ తరగతి పూర్తి చేసిన వారు లేదా అంతకంటే ఎక్కువ చదివిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. 18 నుంచి 28 సంవత్సరాల వయసు గల యువతీ యువకులకు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ అందించడంతో పాటు మధ్యాహ్న భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు.ట్రైనింగ్ పూర్తయిన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సర్టిఫికేట్‌తో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఎల్.జి. హోప్ టెక్నికల్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఈ అవకాశాన్ని ముఖ్యంగా పేద విద్యార్థులు, అణగారిన వర్గాల యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.వివరాల కోసం 9908625756, 8074368668, 8130438200 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాలయువత పూర్తిగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మార్కెటింగ్ మేనేజర్ డి. రాఘవేంద్ర నాయక్ పిలుపునిచ్చారు. IMG-20251230-WA0271

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్న‌లిస్టుల‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది జర్న‌లిస్టుల‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది
_జీవో 252లో మార్పులు – ఇండ్ల స్థలాలకు కోర్టు అడ్డంకులు లేని విధానం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం హైదరాబాద్‌ , జనవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):...
కొండా గోపి పుట్టినరోజు సందర్భంగా నాగులవంచలో రక్తదాన శిబిరం..
శ్రీ గ్లోబల్ హై స్కూల్ నాగులవంచలో ఘనంగా సంక్రాంతి సంబరాలు..
పాత్రికేయ విలువలకు నిలువెత్తు ప్రతీక  టీ.కే. లక్ష్మణ రావు
మీ నమ్మకాన్ని వొమ్ము చేయడం లేదు
సింగరేణి విశ్రాంతి కార్మికులకు కనీస పెన్షన్ పెంచాలి
యాదవులు రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలి