ఆదర్శ పురుషుల పొదుపు సంఘం ద్వారా భీమా సాయం అందజేత
ఎల్కతుర్తి, జనవరి 10: (తెలంగాణ ముచ్చట్లు)
ఆదర్శ పురుషుల పొదుపు సంఘం గోపాల్‌పూర్‌లో రెగ్యులర్ సభ్యులుగా కొనసాగుతూ ప్రమాదవశాత్తు మరణించిన సభ్యుల కుటుంబాలకు సంఘం తరఫున భీమా సాయం అందించారు.
సంఘానికి చెందిన సభ్యుడు గండికోట సాంబయ్య ప్రమాదవశాత్తు మృతి చెందగా, ఆయన కుటుంబానికి సామూహిక భీమా క్లబ్–1 కింద రూ.35,000, సామూహిక భీమా క్లెయిమ్–2 కింద రూ.35,000, అభయ నిధి విపత్సాయం కింద రూ.10,000 మొత్తంగా రూ.80,000లను అందజేశారు.
అదేవిధంగా, ఆదర్శ పురుషుల పొదుపు సంఘం గోపాల్‌పూర్‌కు చెందిన రెగ్యులర్ మెంబర్ గడ్డం సంపత్ ప్రమాదవశాత్తు మరణించగా, ఆయన నామినీకి రెండు లక్షల రూపాయల ప్రమాద భీమా మొత్తాన్ని సంఘం తరఫున అందించారు.
ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు తాటికొండ అభిలాష్ గారు, సమితి అధ్యక్షులు బరిదుల రాజిరెడ్డి గారు, అలాగే సంఘ పాలకవర్గ సభ్యులు పాల్గొని భీమా చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ, సభ్యుల కుటుంబాలకు ఎల్లప్పుడూ ఆదర్శ పురుషుల పొదుపు సంఘం అండగా ఉంటుందని తెలిపారు. 


Comments