కుషాయిగూడ పాత మార్కెట్‌లో జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆకస్మిక తనిఖీలు
కుషాయిగూడ, జనవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా సర్కిల్లో కుషాయిగూడ కూరగాయల పాత మార్కెట్‌లో జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలకు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్, వైస్ చైర్మన్ విఠల్ నాయక్, డైరెక్టర్ పూర్ణ యాదవ్, జేఎంఎస్ కార్తీక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మార్కెట్‌లోని కూరగాయల హోల్‌సేల్, కాంట దుకాణాలు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని కమిటీ సభ్యులు సూచించారు.లైసెన్స్ లేని వ్యాపారులు వెంటనే లైసెన్స్ తీసుకోవాలని ఆదేశించారు. అలాగే కుషాయిగూడ ప్రధాన రహదారిని ఆక్రమించకుండా వ్యాపారాలు నిర్వహించాలని హెచ్చరించారు.అనంతరం కుషాయిగూడ కూరగాయల పాత మార్కెట్ హోల్‌సేల్ మరియు కాంట వ్యాపార సముదాయాల సంఘం ప్రతినిధులు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్, జేఎంఎస్‌లను ఘనంగా సన్మానించారు. తమ మార్కెట్ TGPIIC స్థలంలో ఉందని, వ్యాపారాలకు అనుకూలంగా ప్రభుత్వం స్థిరమైన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వైస్ చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, వారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వ్యాపారులు నాణ్యమైన కూరగాయలను ప్రభుత్వ ధరలకే విక్రయించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కుషాయిగూడ కూరగాయల పాత మార్కెట్ కాంట మరియు హోల్‌సేల్ వ్యాపార సముదాయాల కమిటీ ఉపాధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్, సెక్రటరీ చేతుర్ల దేవేందర్ గౌడ్‌తో పాటు సభ్యులు గణేష్ ముదిరాజ్, కొరెల్లి రాఘవేందర్ గౌడ్, శీలం తిలక్ యాదవ్, శీలం సన్నీ యాదవ్, దూసరి వెంకటేష్,అక్కమనేని ఆంజనేయులు, రాగిరి సాకేత్ గౌడ్, భీమ్ రాజ్ చారి తదితరులు పాల్గొన్నారు. 


Comments