స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా కాప్రా పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా కాప్రా పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

కాప్రా, డిసెంబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు):

స్వచ్ఛ సర్వేక్షన్ షెడ్యూల్‌లో భాగంగా కాప్రా పరిధిలో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యాపార దుకాణాల యజమానులను తడి–పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు రెండు డబ్బాలు తప్పనిసరిగా వినియోగించాలని అవగాహన కల్పించి మోటివేట్ చేశారు.జిహెచ్ఎంసి కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్, కుషాయిగూడ, శ్రీనివాస్ నగర్ ప్రాంతాల్లో డివైడర్లకు పేరుకుపోయిన మట్టి, చెత్త, పిచ్చి మొక్కలను తొలగించారు.ఈ కార్యక్రమంలో కాప్రా డిప్యూటీ కమిషనర్ శ్రీహరి, డీఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రవి, సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్‌తో పాటు జవాన్లు రామకృష్ణ,యాదగిరి, కృష్ణ శ్రీనివాస్, ఎస్‌ఎఫ్‌ఏలు మంజుల, వసంత, లక్ష్మి, సతీష్, గోవర్ధన్ రెడ్డి, అంజలి తదితరులు పాల్గొన్నారు.IMG-20251231-WA0083

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .