కుషాయిగూడలో రోడ్డు ప్రమాదం చికిత్స పొందుతూ యువకుడు మృతి
కుషాయిగూడ , జనవరి 09 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఎం. గంగయ్య శుక్రవారం ఉదయం 09:30 గంటలకు కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన కుమారుడు ఎం. శేఖర్ (23), వృత్తిరీత్యా కార్ మెకానిక్. గత సంవత్సరం కాలంగా హైదరాబాద్ లోని కట్టమైసమ్మ టెంపుల్ కాప్రా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.గురువారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో శేఖర్ తన పల్సర్ ద్విచక్ర వాహనంపై నేతాజీ నగర్ ఎక్స్ రోడ్‌కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో, కట్టమైసమ్మ టెంపుల్ సమీపానికి రాగానే ఎదురుగా వచ్చిన అపాచీ ద్విచక్ర వాహనం (నంబర్: TS 08 FH 8816) అజాగ్రత్తగా, అతివేగంగా నడుపుతూ శేఖర్ వాహనాన్ని ఢీకొట్టింది.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు శేఖర్ యజమాని రాఘవుల శివకు సమాచారం అందించగా, ఆయన వెంటనే ఘటనాస్థలికి చేరుకుని 108 అంబులెన్స్ ద్వారా శేఖర్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం శేఖర్ తల్లిదండ్రులకు తెలియజేయగా, వారు ఆసుపత్రికి చేరుకున్నారు.చికిత్స పొందుతున్న శేఖర్ 09.01.2026 శుక్రవారం రోజు సాయంత్రం 04:18 గంటలకు మృతి చెందినట్లు డ్యూటీ డాక్టర్లు ధృవీకరించారు.ఈ ఘటనపై కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Comments