వెల్టూర్‌లో మహాత్మ జ్యోతిబాపూలే

బాలికల వసతి గృహానికి స్థల పరిశీలన

వెల్టూర్‌లో మహాత్మ జ్యోతిబాపూలే

పెద్దమందడి,డిసెంబర్30(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 200లో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల బాలికల వసతి గృహం నూతన భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ రంజిత్ రెడ్డి రెవెన్యూ అధికారులు, గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి అవసరమైన అంశాలపై అధికారులతో పాటు స్థానికులతో చర్చించారు.అనంతరం ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల బాలికల వసతి గృహాన్ని ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ రంజిత్ రెడ్డి సందర్శించారు. బాలికలకు అందుతున్న వసతులు, భోజనం, భద్రతపై ఆరా తీసి, సంబంధిత రికార్డులను పరిశీలించారు.బాలికల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, నూతన భవన నిర్మాణం ద్వారా మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, కాంగ్రెస్ నాయకులు వడ్డె శేఖర్, మల్లికార్జున్, బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు రమేష్, దండు నరేష్, గుండెల ఆంజనేయులు, కుమార్, జగదీశ్వర్ రెడ్డి, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అనిత, రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.IMG-20251230-WA0267

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్న‌లిస్టుల‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది జర్న‌లిస్టుల‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది
_జీవో 252లో మార్పులు – ఇండ్ల స్థలాలకు కోర్టు అడ్డంకులు లేని విధానం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం హైదరాబాద్‌ , జనవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):...
కొండా గోపి పుట్టినరోజు సందర్భంగా నాగులవంచలో రక్తదాన శిబిరం..
శ్రీ గ్లోబల్ హై స్కూల్ నాగులవంచలో ఘనంగా సంక్రాంతి సంబరాలు..
పాత్రికేయ విలువలకు నిలువెత్తు ప్రతీక  టీ.కే. లక్ష్మణ రావు
మీ నమ్మకాన్ని వొమ్ము చేయడం లేదు
సింగరేణి విశ్రాంతి కార్మికులకు కనీస పెన్షన్ పెంచాలి
యాదవులు రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలి