జోనల్ కమిషనర్ రాధిక గుప్తాను మర్యాద పూర్వకంగా కలిసిన బీఆర్‌ఎస్ నేతలు

జోనల్ కమిషనర్ రాధిక గుప్తాను మర్యాద పూర్వకంగా కలిసిన బీఆర్‌ఎస్ నేతలు

ఉప్పల్, డిసెంబర్ 31(తెలంగాణ ముచ్చట్లు):

కొత్తగా ఏర్పాటైన ఉప్పల్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో నూతనంగా నియమితులైన ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తాను బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్‌తో పాటు పూర్వ నాచారం డివిజన్ బీఆర్‌ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసిన సర్కిల్‌లో నాచారం డివిజన్‌ను సర్కిల్‌గా ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే నాచారం ఓల్డ్ విలేజ్‌లో కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నాచారం వార్డు కార్యాలయ భవనాన్ని సర్కిల్ కార్యాలయంగా వినియోగించాల్సిందిగా కమిషనర్‌ను కోరారు.అదేవిధంగా హెచ్‌ఎంటీ నగర్ పెద్ద చెరువులో గుర్రపు డెక్క విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ పనుల విషయంలో కాంట్రాక్టర్ల ద్వారా ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పనులు చేయించకుండా కేవలం బిల్లులు చెల్లిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కట్ట బుచ్చన్న గౌడ్, చంద్రశేఖర్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .