అల్టిట్యూడ్ పాఠశాలలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
ఎల్కతుర్తి, జనవరి10 ( తెలంగాణ ముచ్చట్లు):
అల్టిట్యూడ్ పాఠశాలలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం అంతా పచ్చని తోరణాలు, రంగురంగుల అలంకరణలతో తెలుగుదనం పొలికపోయేలా పండుగ వాతావరణం నెలకొంది.
విద్యార్థులు కొత్త బట్టలు ధరించి ఆటపాటలతో సందడి చేశారు. ఉపాధ్యాయులు పిల్లలకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించగా, విద్యార్థులు కైట్లు తెచ్చుకొని ఆనందంగా ఆటలాడారు.
ఈ సందర్భంగా విద్యార్థులు రంగురంగుల ముగ్గులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ముగ్గుల పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు.
పాఠశాల కరస్పాండెంట్ పుష్కూరి కార్తీక్ రావు మాట్లాడుతూ, తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతో సంక్రాంతి వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సంక్రాంతి పండుగ గొప్పతనం, ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు అనే విషయాలను విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నవీన్, వైస్ ప్రిన్సిపాల్ లింగం మొగిలి, సరిత, ప్రీ ఫైనల్ ఇంచార్జ్ లావణ్య, వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రె తిరుపతి, ఆశా బేగం, సురేష్, మమత, కవిత, గీత, శ్రావణి, స్వప్న, అనూష, శ్వేత, రమ్యతదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 
.


Comments