అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి రూ.2 లక్షల ఎల్ఓసి మంజూరు
పెద్దమందడి,జనవరి9(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మందడి కృష్ణమ్మ భర్త కరెన్న కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం స్థానిక కాంగ్రెస్ నాయకులు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే మానవీయతతో వెంటనే చర్యలు తీసుకుని ఆయన చికిత్స కోసం రూ.2 లక్షల ఎల్ఓసి ను మంజూరు చేయించారు.మంజూరైన ఆర్థిక సహాయాన్ని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, అవసరమైన ప్రతి సందర్భంలో తమ వంతు సహాయాన్ని అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పామిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం, మాజీ సర్పంచ్ సిద్ధయ్య తిక్కన్న, మాజీ ఎంపీటీసీ ఇంద్ర లక్ష్మారెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.


Comments